కలం గళం ...
యుగళ గీతాలు ...
తేది :26-08-2023
శీర్షిక : ఏం మాయ చేశావో
అతడు :
ఏం మాయ చేశావో
ఎద నిండా నిలిచావు ....
అడుగడుగున నీ రూపం
అలజడులే గుండెలోన ....
ఆమె :
ప్రేమంటే తెలియని నాకు
పాటంగా నేర్పించావు ....
చూపులతో గిలిగింతలు పెట్టి
చిరునవ్వులు రువ్వావు ....
అతడు :
మమతలన్నీ నింపుకుని
మనసు మొరాయిస్తుంది ...
పల్లవించిన ప్రథమ చూపే
ప్రణయానికి దారయ్యింది .... ..
ఆమె:
ఒంటరి జంటయ్యేదాకా
ఓర్చుకో ప్రియసఖుడా ....
పెద్దవారి ఆశీస్సులతోనే
పెనిమిటిగా స్వీకారం ....
ఇద్దరు :
నిరీక్షణలు నిజమౌతుంటే
నిలువెల్లా కితకితలే .....
జీవితమే పూలబాటై
పరిమళాలు వెదజల్లనీ ....
No comments:
Post a Comment