బాలల గేయాలు.
తేది : 18-11-23
శీర్షిక : భావి భారత పౌరుల్లారా
భావి భారత పౌరుల్లారా
బంగరు నవ్వుల చిలకల్లారా
చిన్ని చిన్ని ఆశలతో వెలిగే
చిరుజ్యోతులు మీరండి ...
కన్నవారి కంటివెలుగులలో
పాపాయిలు కదండీ...
// భావి//
బుజ్జి బుజ్జి చేతలతో మీరు
భువనముపై ఎదగాలి …
మహాత్ముల జాడలలో ఎపుడూ
మాహిమాన్వితమై వెలగాలి ...
భావి భారత పౌరుల్లారా
బంగరు నవ్వుల చిలకల్లారా …
మూల పరిమళం మరచిపోక
జవసత్వాలను నింపుకోండి …
నీతి కథలను వల్లె వేస్తూనే
జాతి గౌరవం నిలపండి .
//భావి //
అణకువలకు మీరు ఆలంబనమై
మెలకువలెన్నో నేర్వండి…
వినయ విధేయతల వారసులై
గుణ దోషములు రానీకండి …
భావి భారత పౌరుల్లారా
బంగరు నవ్వుల చిలకల్లారా …
శాస్త్ర సాంకేతికతలు పొదువుకుని
విస్తృత విశ్వం గమనించూ…
సునాయాసమై రాదూ ఏదీ
ఆయాసమే అందించు ఫలాలు…
// భావి //
చరవాణులకు బానిసవకు
నెట్టు గూటిలో చిక్కుకోకు…
మంచితనాలను ఎంచుకొమ్ము
మించినతరుణం రాదని తెలియుము…
భావి భారత పౌరుల్లారా
బంగరు నవ్వుల చిలకల్లారా …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment