Thursday, July 25, 2024

కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్ ... 26-04-24…

 కుంజర యూధమ్ము

దోమ కుత్తుక జొచ్చెన్ ... 
26-04-24… 

రోటీ సినిమా లోని 
పోటీ లేని పాటలా 
విదిలించుము నీ చేతిని 
విసురుము నీ రాయిని ... 

 మొహమాటం లేకుండా 
 మొదటి రాయి నీవే విసురుమా 
 తప్పులే కాదు అసలు దోషం చేయకుంటే 
 ఒప్పుల కుప్పవని ఇతరులు నిన్ను గుర్తిస్తే ...

అప్పిచ్చువాడు వైద్యుడి నానుడిలా 
 చెప్పేవాడికి వినేవాడు లోకువలా 
 ఉప్పుడుబియ్యం వంటలు మానుమా 
 తప్పుడు మాటలు చెప్పుకుంటూ పోకుమా .. 

లోకం కోడై కూస్తున్నప్పటికీ..బావిలోని 
కప్పల బాతకాని వద్దుసుమా.. ఆత్మసాక్షిని 
అణుచుకుంటూ శిథిల సిద్ధాంతాల పేరిట 
రాద్ధాంతాలతో రక్తి కట్టించకుమా ... 

అక్షరమాలలోని అక్షరాలన్నీ 
అవకతవకల తోరణాల కథలు 
చదివి అపుడే మరిచిపోతివా ... లేక 
అవన్నీ ఇపుడు మనకెందుకని 
అలసత్వం చూపుతుంటివా .... 
 
అభివృద్ధి సమృద్ధిగా జరిగిందంటూ 
అంకెలన్ని లంకెలతో ఆధార భూతమై
అట్టుడుకుతున్న విశ్వవార్తలతో ... 
ఏకీభవించక... ఒప్పని మనస్తత్వం.. 
ఒప్పును తప్పంటూ ఎలుగెత్తి చాటడం.. 

ఇంటి కోడి పప్పుతో సమానమని
ఇరకాటపు సహనశీలతలు ... 
ఒంటి ఆరోగ్యము మరిచిపోకుమా  
కంటినిండా చిత్రం కనుమా 
వంటింటి కుందేలువు కాకుసుమా...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment