సేవా భావం
తేది : 08-05-2024
శీర్షిక: బుడతడివైనా సరే…
స్వార్థమెరుగని సరంగుగా
ప్రతిఫలమాశించక చేసే కర్మ
అచ్చమైన సేవాభావానికి
స్వచ్ఛమైన సంపూర్ణం .....
హైందవాన సుపరిచితమే
అన్నదాన సత్రాలు అంతటా ...
చలివేంద్రం మొదలు రక్త
దాన శిబిరాల వరకు....
స్తోమతానుగుణముగా సొంత
సంపాదనలో కొంత ప్రజాక్షేమ
కార్యక్రమాలకు వెచ్చించడమే
పొరుగు క్షేమం పొందు లాభం ...
అందరు బాగుండాలి ... అందులో
నేనుండాలని కోరుకోవడమే
అసలు సిసలైన సేవాభావం ...
ఆరోవంతో ... పదహారోవంతో ... ఇష్టం.
కరోనా తదుపరి కార్పొరేట్
ఆసుపత్రుల్లా కాకుండా ...
శ్రీ శ్రీ గారన్నట్టు ... నేను సైతం
ప్రపంచాగ్నికి సమిధనొక్కటి
ఆహుతినిచ్చాను ... అన్నట్టుగా ...
ఎంతోమంది మహర్షులు మునులు
తపశ్శక్తితో సాధించిన విజ్ఞానాలను
ఆయుర్వేద శాస్త్రాలను ప్రజా
సంక్షేమాలకు అందించినట్టుగా ... ..
బుడుతనివైనా సరే ... ఉడుతలా
చిన్ని సాయమైనాఅందించు ...
మాట సాయంకన్నా ... చేత సాయం
మిన్నా ... మరువకురా ఒరన్నా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment