అపజయం విజయానికి తొలిమెట్టు
తేది 26-04-24
శీర్షిక : విజయాశ్వం గాలిలా దౌడు తీసేది
ప్రయత్నమే శత సఫలీకృతం
జయాపజయాలు దైవాధీనాలు
సవాలక్ష పరిస్థితులు సహవాసమైతేనే
జయం పలకరించే పరవశాలు ...
కొంతమంది తరగతి గదిలో పరీక్షలు
తప్పరేమో
కాని..చాలా మంది
నూతనావిష్కరాలకు
నుడికారమే
అపజయం.. ఆనకనే మెట్టుచేసుకుని
విజయతీరాలను ముద్దాడేది...
మౌఖిక ప్రణాళికాలెంత
పకడ్బందీగా
వేసుకున్నా
అమలు జమల పరికరాలు
అంతే
పకడ్బందీగా అమిరితేనే విజయ
పరంపరల వీర విహారం ...
పనుల ఫలితాల సఫలతలలో
పలకరించి కుంగదీసే లొసుగుల
లోటపిటలను లొంగదీసుకుంటేనే..
విజయాశ్వం గాలిలా దౌడు తీసేది..
ఇంటి కోడి పప్పుతో సమానంలా… ఆహా ఓహో
అనుకునే చాలామంది విశ్వ శాస్త్రవేత్తల
ఆవిష్కరణలకు వేదపురాణాలే మూలమని
విదేశీ మీడియాల విభిన్న కథనాలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment