Thursday, July 25, 2024

మనసు కరిగితే తేది : 26-04-24 శీర్షిక : మానవతకు కొలమానం.

 మనసు కరిగితే 

తేది : 26-04-24
శీర్షిక : మానవతకు కొలమానం.  

ప్రకృతి తత్వాలను పుణికి 
పుచ్చుకున్న మనిషి సందర్భానుసారం 
నవరసాలకు దాసోహమే ... 

మబ్బు కరిగితే వాన కురిసినట్టు 
మనసు కరిగితే ఆత్మీయత సిరులు 
కురిసి అనురాగం పెరుగును ...

జీవరాశికంతా ఉన్నదే భావరాశితో 
బంధాల మధ్య ఉన్న బంధుత్వపు 
మాధుర్యాలను వెలిబుచ్చడం ... 

విజ్ఞానాలఖని.. వివేకాల నిధి…విచక్షణల 
వింత జాతరలతో..మసులుకుని
ఆలోచనలల్లుకున్న మనిషికి మరింత….

మంచు కరిగితే ఊష్ణము విలువ
తెలిసినట్టు మనసు కరిగితే మానవత్వపు
విలువలకు కొలమానం… 

మనసును కదిలించే సన్నివేశాలకు 
మమతలు కుమ్మరించే మాతృమూర్తిలా..
భావ ప్రస్పుటితములకు మూలం… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment