Thursday, July 25, 2024

అంతా అయిపోయాక తేది: 25-04-24 శీర్షిక : రేపటిని దర్శించగలగడమే

 అంతా అయిపోయాక 

తేది: 25-04-24
శీర్షిక : రేపటిని దర్శించగలగడమే

 అత్యధిక వివేకాల విచక్షణలే 
 ఆధిక్యతలు కట్టబెట్టి అగ్ర 
 తాంబూలాలతో జీవరాశిలో 
 మనిషిని మిన్నగా చూపాయి.. 

తదనుగుణంగా తపనలు పడి 
తర్ఫీదుల తలమునకలై 
ప్రణాళికల పర్యవేక్షణలతో ఫలితాలను
రాబట్టడమే మేటి మెలకువలు.. 

 చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే 
 అంతా వృధా ప్రయాసే అవుతుంది ... 
గత అనుభవాలను ఆసరా చేసుకుని 
భవిష్యత్తు గమ్యాలకు వర్తమానాల నిచ్చెనెక్కాలి…. 

నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళంటూ
మూర్ఖంగా వాదించుకుంటూ పోతే..పులిహోరలో
కరివేపాకులా పక్కనపెట్టి పనులు చక్క పెట్టుకునే
నైపుణ్యాలను వంట పట్టించుకుంటారు జనం… 

ఏది ఎప్పుడు ఎలా ఎందుకు ఉపయోగమో 
ఎవరం చెప్పలేము చెరువుల నీళ్లన్నీ గట్టు
తెగినాక గుట్టు బయటపడినట్టు..
దూరమైన బంధాల బాధలు గుండెలో 
తడిచేసి తడుముతుంటాయి ... 

అందుకే రేపటి దృష్యాన్ని నేడు 
దర్శించ గలగడమే సరయిన సమర్థత..
 సద్భావనల ఉద్బోధనలే 
 సదా సమర్దనీయము ఆచరణీయం ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment