Thursday, July 25, 2024

తళుక్కుమన్న ఆశలు తేది 26-03-24 శీర్షిక : సడలని పట్టుదలలు

 తళుక్కుమన్న ఆశలు 

తేది 26-03-24
శీర్షిక : సడలని పట్టుదలలు 

తుఫాను హరికేన్లు సునామైనా
నిషాని వదిలి వెళ్లిపోవాల్సిందే..
కుశాగ్ర బుద్ది నీ సొంతమైతే 
నీలినీడలను తుడిచిపెట్టి
అడుగుముందుకేయవా ... 

శిశిరంలా నిస్సారమై 
సాగిపోతున్న జీవనంలో …
ఉన్నట్టుండి కాలమార్పుల కవాతులా 
వసంతం వచ్చేసిన గురుతులు ...

ఒంటి స్థంభం మిద్దెమేడలా ధర్మం నిటారుగా 
నిలవాలంటే నాలుగుపాదాలు అవసరమయినట్టు
 గమ్యం చేరికకు... పనిముట్లు, ప్రణాళిక, పద్ధతి ,
 ఫలితం నిర్దేశిత కాలపరిమితి అవసరమే ...

ఆశయం ధర్మబద్దమైతే 
ఆశల గమనం న్యాయమైతే 
పరిసరాలు పరిస్థితులు అన్నీ 
పక్కనే తోడు నిలబడతాయి ...

నమ్మకపు దారులన్నీ మూసుకు
పోయాయని దార్శనికతను వదలొద్దు ...
 గురుబోధనలే గురుతరమై
తళుక్కుమనే ఆశల రేఖవ్వాలి… 

సడలని పట్టుదలలు 
దృఢ నిశ్చయాలు.. నీ
పెట్టుబడైతే .. పట్టు దొరకదా 
పుట్ట తేనెల బుట్ట చేతికి ...


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment