Thursday, July 25, 2024

వాక్ స్వాతంత్య్రం తేది : 26-03-2024 శీర్షిక : జేగంట

 వాక్ స్వాతంత్య్రం 

తేది : 26-03-2024 
శీర్షిక : జేగంట 

కోడు కూసింది కానీ మనిషి 
కూయడానికి సమయం కాదిది  .... 
చెట్టు లేని చోట ఆముదం చెట్టే 
మహా వృక్షమై[పోయినట్టు ...

చడ్డీ ఊడిపోయే బుడ్డ నాయకుడైనా 
సరే...పచ్చిబూతులు కుమ్మరించుకుంటూ 
పక్కవారిని పరామర్శించవచ్చు ....
కనపడ్డవారిని కరుసుకుంటా పోవచ్చు ...  

ధర్మం తప్పని అపర ధర్మజున్నని 
ధర్మకాంటాలో కూడా తూచవచ్చంటూ 
సూక్షంములో మోక్షమును బోధిస్తూ 
మోక్షమార్గాలన్నీ వల్లె వేస్తారు .... 

పొరపాటున ఓటరై ఉండి  
పొద్దుపోక సుద్దులు చెప్పాలన్నా 
వాట్సాప్ లోనో .. ముఖ పుస్తకంలోనో  
ట్వీట్ పెట్టావనుకో ... తాట తీసి 
తంగెళ్లలో తాటాకుల్లా ఆరేసుకుంటారు .... 

అక్షరముక్క అవసరం లేదని 
రాజకీయం ప్రజాసేవంటూనే 
మంచిమాటలు వల్లిస్తూనే...
అలవెన్సులు పెన్షన్లు ఆనక 
అమ్యామ్యాలంటూ అర్రులు 
చాచుడేనాయె ....

మాగొప్ప రాజ్యాంగమని 
మనకు మనమే కితాబిచ్చుకునుడు ... 
మరలిచూడకుండా మరెందుకు 
మార్చుకోరు నాయకులంతా .... 

జనసామాన్యులకొచ్చిన 
జన్మరహస్యాల మర్మం ప్రశ్నలు ...  
జరంత అందిపుచ్చుకుని 
జేగంట కొడితే జయహో అంటారు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment