కవన రవళి
నానీలు
తేది 26-03-241.ఎన్ని “కలలో”
నాయకులకు
సీట్లకై పాట్లతో
ఓట్ల తొక్కిసలాటలో…
2. ఆట మొదలైంది
పోటా పోటీగా
ఓటుకు నోటు
మరకకు మందు…
3. మంచిని నమ్ముకో
మనసును అమ్ముకోకు
మనతోనే
మొదలెడదాం…
4. ఎన్నికల
నగారా మోగింది
ఎన్ని కలలనైనా
పండించుకోవచ్చు…
5. కోడు కూసింది
కూడు గుడ్డకు
ఓడిపోకు
భవిష్యత్తుకు బాటెయ్యి…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment