చిత్ర కవిత/ గేయం
శీర్షిక : రంగోళి
24-03-24ఆడుదమా రంగోలీ
మనసారా మనమంతా
శిశిరం తల దులిపితే
వసంతం పలకరించ…
వచ్చింది వసంతోత్సవం
తెచ్చింది మనోల్లాసం ...
// ఆడుదమా //
హరివిల్లును నేలదించి
విరిజల్లులు కురిపించగ
అమిరిన సప్తవర్ణాలతో
గుప్తములే ఆరోగ్యసూత్రం…
ఆడుదమా రంగోలీ
మనసారా మనమంతా
తరచి చూస్తే తదేకమే
తరిమిన గుర్తు రాక్షసం ...
తనివిదీరా మనమంతా
తమకములై ఆడుదమా ...
// ఆడుదామా//
హోళికను సంహరించిన
మాలికనే పర్వదినం ...
అచ్చమైన రంగులతో
ఆస్వాదిద్దాం మానవతం
ఆడుదమా రంగోలీ
మనసారా మనమంతా
తలుచుకుంటే మనసంస్కృతి
సమున్నతమే ఆధ్యాత్మికం
తనువులన్నీ పులకించవా
తనవారు నడిచిన మార్గం ...
//ఆడుదమా //
చిన్నాపెద్దలు తేడాలేక
ఆడుదమా రంగోలీ
సిరిమువ్వల సంధికాలం
చేద్దామా సద్వినియోగమూ…
ఆడుదమా రంగోలీ
మనసారా మనమంతా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment