Thursday, July 25, 2024

ఉగాది తేది : 26-03-2024 శీర్షిక : సత్సంప్రదాయం

 ఉగాది

తేది : 26-03-2024
శీర్షిక : సత్సంప్రదాయం 

అనుభవాల పూదోటలో 
అమృతగుళికల మకరందం 
కాల మార్పుల ప్రాధాన్యం 
కణికట్టుగా సాధించాడు .... 

శిశిరం తలలు దులుపుకోగానే 
వసంతం వచ్చి పలకరిస్తుంటే ...  
పులకించిన ప్రకృతమ్మ ఒడిలో 
సేద దీరడం నేర్చుకున్నాడు ....  

కాల మర్మంలో కాంతిపుంజంలా 
ఆరోగ్య రహస్యం అందులోనే 
దాగిందని కనుక్కున్న మానవుడు 
అవపోశన పట్టాడు ప్రకృతితో .... 

అక్షరాస్యతల పట్టాలు లేకున్నా 
అలతి అలతి విధానాలు 
అవలంబిస్తూ ఆరోగ్య తీరాలను 
అందిపుచ్చుకోవడమే అసలు రహస్యం .... 

ఇంటికి పచ్చ తోరణాలు కట్టి 
ఒంటికి పంచెలు చుట్టుకోవడం ... 
శుచి శుభ్రతల వడబోసి 
పూజలు చేసి పూర్ణాల ఆరగింపుతో  

సనాతన జీవన విధానంతో 
సత్సంప్రదాయాల వారసత్వంగా 
షడ్రుచులు మేళవించిన 
పచ్చడి తాగడం పరిపాటి... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment