ఉగాది గేయాలు
తేది : 06-04-2024
శీర్షిక : కాలగణన చైతన్యం
వినవయ్యా తెలుగువీర
వివరంగా తెలిపెదను
అనుభవాల పూదోట
ఆదిపూజ్యుల రాచబాట
కాలగణన చైతన్యంతో
కదిలినారు సుతారమై ...
ఆయనములు రుతువులు
అనంతమైన శూన్యములను
మాసములు పక్షములుగా
మదించిరి పరిణామములు ...
వినవయ్యా తెలుగువీర
వివరంగా తెలిపెదను
తిథి వార నక్షత్రములు
తిమిరముతో సమరములు ....
ఘడియలు విఘడియలు
గండికొట్టే ప్రళయరుద్రాదులు ....
సూక్షంలో మోక్షముగ
సున్నితముగా వడగట్టిరి
ఖగోళంలో మార్పులతో
కలివిడిగా జతచేసిరి ....
వినవయ్యా తెలుగువీర
వివరంగా తెలిపెదను .
శిశిరములో తలదులిపి
చిన్నబోయిన ప్రకృతిని
వసంతమై వచ్చి తాను
వత్తాసుగా పలకరించు...
కొత్త కొత్త శోభనిండగా
కొలమానమె కాలచక్రం ....
ఉషస్సుతో నిలిపినాము
ఉగాది పర్వదినముగా ....
వినవయ్యా తెలుగువీర
వివరంగా తెలిపెదను
కాలచక్రపు పరిభ్రమణంలో
ఋతువు సంధికాలములు ...
బ్రతుకు గమనం చూసుకున్న
భాగ్యశాలి మానవుడు ...
చూతపత్రముల సాక్షిగా
ఉడతాభక్తిగా పూజించెదరు ...
ఉన్నతవిలువల ఔషధంగా
షడ్రుచి పచ్చడి సేవించెదరు....
వినవయ్యా తెలుగువీర
వివరంగా తెలిపెదను ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment