Thursday, July 25, 2024

పరిశోధన 10-04-24 శీర్షిక : అంశము అవగాహన

 పరిశోధన 

10-04-24
శీర్షిక : అంశము అవగాహన 

 ముంజేతి కడియానికి 
 మురిపాల అద్దములా 
 అంశపు అవగాహనను 
 అవపోశన పట్టడమే ... 

 ఆధార సహితములు 
 అందిపుచ్చుకునే మార్గం.. 
 సాక్ష్యాల చిట్టాను సవరించి 
 దస్తావేజులలో దఖలుపరచడం.. 

జ్ఞాన విజ్ఞానముల సంవాదం 
మేధోమధనముల బాండాగారం 
నాగరికతలో నడకలు నేర్పిన గుణశీలి..
పారిశ్రామికతలో పట్టం కట్టిన విదుషీమణి ... 

సాలెగూటి సాంకేతికతలో 
సమరవీరత్వపు సంకేతం ...
విశ్వ గగన వీదులలో
ప్రగతికి పట్టంకట్టే ప్రజ్ఞాన ఖని… 

వేద పురాణాల పుష్కరిణి 
ఉపనిషత్తుల సమాహారం 
మహాఋషుల మహిమాన్వితం 
మాటతో మంత్రించిన అస్త్రశస్త్రములు 

క్రూర క్రిముల వికృత క్రీడల 
 సంక్లిష్ట సమయాల సంధికాలంలో 
 ప్రాణవాయువుల సంజీవనియై 
 మానవాళికి జీవరాశికి మహోన్నతం
 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment