కవన రవళి
గజల్
తేది 23-03-246/6/6/6
ఆకలికి అమ్మలాగ
మారిపోయె ఓ నేస్తం
ఆపదొస్తే నాన్నలాగ
చేరిపోయె ఓ నేస్తం
అల్లర్లకు తోబుట్టుగ
వాలిపోయె ఓ నేస్తం
అప్రకటిత రహస్యాల
నెలవాయె ఓ నేస్తం
బంధాలకు అతీతమై
భావాలకు దగ్గరగా
కలతలేని మమతలతో
కోవెలాయె ఓ నేస్తం
స్వార్థాలకు దూరంగా
సమతలకూ నిర్వచనం
సన్నిహితం సదా కోరె
మమతలాయె ఓ నేస్తం
రాజసాల పరిమళాలు
రంగరించు భావనవై
చీకటిలో మిణుగురులా
వెళుతురాయె ఓ నేస్తం ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment