Saturday, July 13, 2024

లలిత గేయాలు తేది : 24-02-2024 శీర్షిక : ఆడతనం ..

 లలిత గేయాలు 

తేది : 24-02-2024
శీర్షిక :  ఆడతనం .... 

లలిత లలితములే  
అతివల రూపము.... . 
కుసుమ కోమలమే .... 
కోమలి మానసం .... 

ఆత్మీయతలమ్మతనం 
అనురాగపు చెల్లితనం 
అనుబంధపు ఆలితనం....  
కలగలిపిన ఆడతనం ..... 

ముమ్మూర్తుల ముచ్చటగా 
ఆదిశక్తి అవతారం ..... 
మానవాళి పురోగతికి 
మననమయే సుందరం... 

లలిత లలితములే  
అతివల రూపము  . 

తనువు చీల్చుకుని 
తనజాతికి జన్మమిచ్చు .... 
తపనలు నింపుకుని 
స్తన్యముతో పోషించును ..... 

తుమ్మ ముళ్ళు గుచ్చినా 
అమ్మా అనే మన ముందు 
అబలేల ఆయెనో
సబబుకాని మాట అది .... 

లలిత లలితములే  
అతివల రూపం . 

నిరూపమానమయ్యే  
నిలువెత్తు నిజరూపం .... 
గరళములను మింగినా 
అమృత భాండము .... 

కష్టాలను భరిస్తూనే 
కనికరములు చూపించగ.... 
సబలలేనని రుజువైనా  
సందిగ్ధములు ఏలనో.... 

లలిత లలితములే  
అతివల రూపం . 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment