Saturday, July 13, 2024

లలిత గేయాలు తేది : 22-04-2023 శీర్షిక : ప్రకృతి

 లలిత గేయాలు 

తేది : 22-04-2023
శీర్షిక : ప్రకృతి 
కవిత సంఖ్య :  సహస్రాధికం 

హైలెస్సా .......హో .... 
హైలెస్సా ....... 
హైలెస్సా ....... హో .... 
హైలెస్సా ....... 

నిశీధమ్మ  తప్పుకునే
నీరాజనమందుకునే  ..... 
కువకువల రాగాలతో 
కూతవేసె పక్షులతో .....  

తూరుపమ్మ తెరవగానే  
సింధూరం విచ్చుకునె .... 
ఆకాశం హరివిల్లై 
వింతశోభ  సంతరించె ... 

హైలెస్సా ....... హో .... 
హైలెస్సా ....... 
హైలెస్సా ....... హో .... 
హైలెస్సా ....... 

రెపరెపల కుక్కుటములు
రేయికి వీడ్కోలు పలక .... 
క్షీరధార సద్దులతో 
పల్లెతాను పులకరించె ....  

తోకెత్తిన లేగదూడ 
చెంగుమనీ దూకంగా... 
అంబా అని తల్లిగోవు 
ఆత్మీయపు స్పర్శలే .... 

హైలెస్సా ....... హో .... 
హైలెస్సా ....... 

ముదితలంత ముగ్దమై 
కళ్ళాపి చల్లినారు .... 
ముగ్గులతో రంగవల్లి 
మురిపంగా దిద్దినారు ..... 

హాళికుని అడుగులకు
అవనిమాత పులకరించె
పాదములు మోపగనే
పచ్చని తివాచీ పరిచింది… 

హైలెస్సా .......హో .... 
హైలెస్సా ....... 

ఎడబాటై తల్లి పశువు 
పిల్లలను వదిలిపెట్టె .... 
ప్రతి ఇంటా ఇదే తంతు 
పచ్చికలకు బైలెల్లగ..... 

జీవనసారం ఇదేనని 
భావుకతగ బోధించెను
గురుతెరుగు మానవా 
గుంభనమే బోధనలు…. 

ప్రకృతియే పరమాత్మ 
తలపాగలు ఊపుతుంటే 
బంతిలాగ  మెరిసింది 
దినకరుడై  పలకరించ ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment