Thursday, July 25, 2024

హోళీ గేయాలు తేది 23-03-24 శీర్షిక : సప్తవర్ణం…

 హోళీ గేయాలు 

తేది 23-03-24
శీర్షిక : సప్తవర్ణం… 


వచ్చింది వచ్చింది వసంతాల కేళీ 
వరమై నిలిచింది వర్ణాలతో హోళీ …

ఆయనం మార్పులో వాయనమై వచ్చింది
శిశిరములో భాసురమై శరశ్చంద్రికై వెలిగింది
హోళికను దహించి రక్కసిని మట్టుబెట్టి
ప్రహ్లాదుని కావగా పరిమళించే దైవత్వం ...
                     //వచ్చింది//

పాల్ఘుణమాసమున పౌర్ణమి శుభదినమున 
ప్రసిద్దికెక్కెను…హోళీ పేరుతో రేపల్లెలోనా…
చిన్నా పెద్దలను చేరదీసి కలిపింది
పల్లె పట్నం సంబరమే పసందైన ఆటగా… 
                         //వచ్చింది//

రంగులతో హంగులద్దె రమణీయపు కృష్ణయ్య 
రాధమ్మను ఆటపట్టి రసరమ్యతలొలకబోసి
వర్ణములతో కేరింతలు వరసైన గోపికలతో 
మధుర బృందావనమున  మనసైన కన్నయ్య ...
                         //వచ్చింది//
ఆడుదామా మనమంతా అసలైన రంగులతో
ఆత్మీయత వెల్లివిరియ అనురాగం వికసించ
అదే కద మన సంస్కృతి అసలైన  వారసులం
కూడదని తెలపండి రసాయనాలు హానికరం… 
                          //వచ్చింది//


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment