Thursday, July 25, 2024

నిన్నటి నేనుకై తేది: 22-03-24 శిర్షక: మిశ్రమ భావనలు.

 నిన్నటి నేనుకై 

తేది: 22-03-24
శిర్షక: మిశ్రమ భావనలు. 

కల్మషము కపటమెరుగని బాల్యములో 
కలిసి మెలిసి ఆడుకున్న దాఖలాలే… 
ఆటలన్నీ ఆభరణాల గొలుసులై మెడలో 
మెరుపులతో వేలాడుతుంటే సంబరమేస్తుంది... 

 బరువులు బాధ్యతలెరుగని వయసులో
 చదువులొక్కటే చక్కని వ్యాపకమై 
 అక్షరసరస్వతి అంగనములో తచ్చాడి
 అలుపులు తీర్చుకున్న ఆనందాలు ...

సప్తవర్ణాల సరిగమలు పలకరించే
వయసు ప్రవేశాన…కలలన్నీ హొలీ
రంగులమయమై కబాడీ ఆడిన 
క్షణాలన్నీ ఏరుకుంటుంటే ఆనందాలే ...

కష్టాలన్నీ తాము బాధ్యత తీసుకుని 
అమ్మా నాన్నలు సుఖాలను మాకు 
దఖలు పరిచిన.. ప్రతి దృశ్య మాలిక 
కనులముందు కదలాడుతుంటే 
కలుగదా కొంత అపరాధ భావన...

బాధ్యతల బండిలో ప్రయాణిస్తుంటే 
అప్పుడప్పుడుతొందరపడిన చిన్నా చితక 
సందర్భాల మననం... సరి చేసుకోలేని 
వేళలు కూడా అపరాధన భావనలే...

 ఏది ఏమైనా జీవిత నాటక రంగములో 
 స్వయంకృతాలను మించి అప్పుడప్పుడు 
 భగవదేచ్ఛతో అడుగులేయడమే తప్ప...
తప్పుకోలేని తపో సన్నివేశాలేనేమో ...


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment