Saturday, July 13, 2024

లలిత గేయాలు తేది : 17-09-22 శీర్షిక : తెలంగాణ సాధకుడా

 లలిత గేయాలు 

తేది : 17-09-22
శీర్షిక : తెలంగాణ సాధకుడా 
కవిత సంఖ్య : 

వినరా ఓ వీరుడా 
తెలంగాణ సాధకుడా 

పదితరాలు పడిలేచి 
అయ్యా బాంచెనన్న గొంతు
దొర ఏందిర వాని జులుమేందిర
అన్న రోజు…. 

మూడువందలేండ్ల దాక… 
ముప్పుతిప్పల పడ్డోళ్ళు
మూతిమీద వాతపెట్టి
ఎదురు తిరిగిన రోజు…. 

ఊరూరా గడీలే 
ఊడిగాల బతుకులు 
భూమి లేదు భుక్తిలేదు 
శాకిరంతా దొరలపాలు … 

ఊరుమ్మడి బతుకులన్నీ 
వెట్టిచాకిరీల పాలాయే… 
పేగులను చేతబట్టినా
కడుపునిండని కలిగంజే…. 

నిద్రలేని రాత్రులన్నీ
నిక్కచ్చిగ ఒక్కటైన రోజు 
మించుకచ్చిన పాపాలను 
మట్టుబెట్టిన రోజు .... 

కలవరింతల వంతపాడి 
కట్టగట్టి పాతిపెట్టె
కారం దంచిన చేతులే 
కామాంధుల కళ్ళల్లో కొట్టిన రోజు 

తప్పదీసిన బతుకులను 
తగలపెట్టిన రోజురా 
రోకండ్లను తిరగేసి 
మోత మోగించిన రోజు … 

No comments:

Post a Comment