మోడు గుండెల చిగురింత
తేది : 19-03-24
శీర్షిక: పట్టెడన్నం పెట్టే అన్నపూర్ణ
సహస్రాధికం:
మండుటెండల మంటల కొలిమిలో
అంటకాగుతున్న ఒంటిమామిడి చందంగా
పండిన పండ్లన్నీ పరదేశం దారి చూసుకుంటుంటే
భరతమాత
ఒడి బోసిపోయి చిన్నబోతున్నది...
ఏ మంత్రదండమూ మంత్రించదాయె
ఏ రాజదండమో రాణించదాయె
చెట్టుకు కాయ బరువు కాదన్నట్టుగా
ఒడిలోకి తీసుకుని ఊరడించదాయే ...
ఎవరి బతుకు వారిదన్నట్టు
వింతలు చూసే సంత పక్షుల్లా …
మూటాముల్లెలు సర్దుకోవడమే
ఐదేండ్ల బంతాట అనుకుంటే ఎలా?
పదిశాతం పాలకుల వద్ద ఐదుశాతం
అధికార గణాలవద్ద కొలువుదీరిన సంపదలను
పెట్టుబడి చేస్తే పుట్లకొద్దీ పరిశ్రమల స్థాపనై
పుష్కలమే కద పుట్టగతులు యువతకు….
పుట్టిన ప్రతీ బిడ్డకు పట్టెడన్నం
పెట్టే
అన్నపూర్ణగా ఎదగాలి నా దేశం....
విశ్వంలోనే వింత కలిగిన సంతసమై
విజయకేతనం ఎగరేయాలి వినీలాకాశంలో...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment