Wednesday, July 3, 2024

వెన్నెల దారిలో తేది : 22-02-24 శీర్షిక : గోదారి తిన్నె…

 వెన్నెల దారిలో 

తేది : 22-02-24
శీర్షిక : గోదారి తిన్నె… 

పాలపుంతల పందిరిలో 
ఒదిగిన నక్షత్ర మాలలలా … 
సెలయేళ్ళన్నీ కూడబలుక్కుని
తీర్చి దిద్దిన గోదావరి తిన్నెలా … 

కృష్ణంలో క్షీణిస్తూ శుక్లములో 
వృద్ధి చెందుతూ పరిక్రమలో 
ఫరిఢవిల్లే ప్రగతిశీల పాలకుడు... 
పిండి వెన్నెలలు వెదజల్లే రేరాజు… 

దూదిపింజముల్లాంటి మబ్బుల్లో 
మసకేసినా... ముద్దుల మామగా 
 మారిపోయి... ముద్ద నోటికందించే 
 మురిపాల కలువల రాయుడు... 

యవ్వనాల జోరు గువ్వజంటలకు 
 గుండుమల్లెల గుసగుసలు చెప్పి 
 మత్తెక్కించినా ... మంచిగంధపు 
 చల్లని వెన్నెల వెదజల్లి సేదదీర్చు ...

పంటపొలాలలో వెంట నడిచి
 హాలికున్ని ఓ కంట కనిపెట్టుకునే 
 రేరాజు ... పచ్చని పల్లెతల్లికి వెండి 
కంచమైన సిరిసంపదలే...


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment