జలతంత్రి
తేది : 05-02-2024
శీర్షిక : జీవనది ధార.
హిమాలయాల కోటగోడలు
పర్వత మాలల అండదండలు
మూడుపక్కల సంద్రములు
మనకు నిజమైన వరములే ...
అల్లన సాగే నైరుతి ఋతుపవనములు
మెల్లగ పలకరించే ఈశాన్య
ఋతుపవనములు ... వెరసి
గంగా యమునా గోదావరి నర్మదా
కృష్ణా కావేరి జీవ నదీమతలల్లుల
దీవెనలతో జలతంత్రులే మానవాళికి ...
పరుగెత్తుతున్న పారిశ్రామికతలో
పక్కేసిన మానవాళి అలసత్వాలో
తిరగేసిన వాతావరణ మాలికలతో
తరిగిన జాడల జలసిరులు ....
ఆరుద్రగారన్నట్టు మానవుడే
మహనీయుడై... పరుగెడుతున్న
నీటి ధారాలను ... పైపులతో పట్టి తెచ్చే ....
హాలికుల కళ్ళల్లో మెరుపుజూడ ....
కదిలిపోతున్న కన్న తల్లి గోదారమ్మను
కనికరించమని వేడుకుంటూ
కాళేశ్వరాన మేడిగడ్డ ప్రాంతాన
కట్టడి చేసిరి బంధమేసి నిలువరించి ...
అన్నారం సుందిల్లలకు సల్లంగ పంపించి
పంట పొలాలకు చిరునవ్వులు పంచుతూ....
ఆపైన మెల్లంగ ఎల్లంపల్లికి చేర్చి
పారిశ్రామిక వాడలను పలుకరిస్తూ
నంది మేడారం రామడుగుల మీదుగా
మధ్య మానేరుకు మళ్లించి సేద దీర్చి
అనంతగిరిని ఆవరించి మల్లన్న సాగారు ద్వారా
జలజలా కొండా పోచమ్మకు అండగా నిలువుమనే
తెలంగాణ మాగాణుల బంగారం పండించ ....
పట్టుదలల ప్రతిరూపమై బహుగొప్ప
ఇంజనీరింగ్ అద్భుతానికి తెరతీసి
చూపులకు చాలనంత పెద్ద మోటార్లతో
బారైనా కాలువలు బహువింత టన్నెళ్లు
విశ్వంలోనే వింతైన ఎత్తిపోతలు ....
తెలంగాణ ఆవరించె జలతంత్రిగా
ధర్మపురి నుండి మేడిగడ్డ వరకు
తాగునీరు సాగునీరు పరిశ్రమలకు
దక్కనుకే పెద్ద దిక్కై శాశించగా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment