Thursday, July 25, 2024

వినోద గేయాలు తేది : 20-04-24 శీర్షిక : కరువైన సంతోషం

 వినోద గేయాలు 

తేది : 20-04-24
శీర్షిక : కరువైన సంతోషం… 

వింత వింత లోకములో
వినోదమొక సంతయ్యింది 
ఎంత చెప్పినా ఏముంది
సంతోషాల జాడ కరువైంది… 

సాంకేతికత చంకనెక్కాక
సారిస్తున్నది దిక్కులన్ని
పక్కనున్న మనిషితోనే 
లెక్కలేని తనమయ్యింది… 

చరవాణిని  గిల్లేస్తూ
తెరలవాణిని గీరుతున్నరు… 
అంతర్జాలానికి  వేళ్ళన్నీ
అతుక్కు పోతున్నాయి… 
         // వింత వింత // 

మిషలెన్నో చూపించి మీన 
మేషములు లెక్కపెట్టినట్టు… 
విసురు మాటలు సంధించే 
పసలేని పాలకుల పనితనములా… 

పెళ్ళిల్లలో పేరంటాలలో 
శాస్త్రీయతలకు శనార్తులు… 
సహజత్వము లోపించి
సాగిలపడి బీరిపోతున్నది… 
                //  వింత //
అనుభవాల సారాలను 
అటకెక్కిస్తున్న తైతక్కలు … 
చిత్రాలకు ఫోజులతోనే
చిక్కిపోయే సమయమంతా.. 

అయ్యవారి మంత్రాలన్నీ 
అటకెక్కుతున్న దాఖలాలు 
కదం తొక్కుతున్న కల్తీలాగా 
కబళిస్తుంది మనను సైతం...          
            //  వింత //
వేదికలపైన బాకాలూదే
వినాయకుల మాటలలా .. 
మంచి సూక్తులన్నియును
వాట్సాపులకే  పరిమితం… 

మొహమాటం లోలోపల 
మొత్తుకున్నా నోరు పెగలదు..
తనదాకా విషయం వచ్చి 
తంటాలు మొదలాయె … 
              // వింత // 




నగునూరి రాజన్న 

No comments:

Post a Comment