Thursday, July 25, 2024

మాట మాట పెరిగితే తేది: 19-04-24 శీర్షిక: మౌనం సమాధానం కావాలి…

 మాట మాట పెరిగితే 

తేది: 19-04-24
శీర్షిక: మౌనం సమాధానం కావాలి… 


మాట మాట పెరిగితే 
తూటాలై పేలుతుంటాయు… 
టాటాలు కూడా చెప్పుకోలేక 
పోటీలు పడి విడగొడతాయి… 

కుండెడు తేనెలో నీటిచుక్కలా
కుదేలయిపోతాయి జీవితాలు …
కుంచించుకపోతాయి బంధాలు 
కుమిలి కుమిలి ఏడుస్తాయి మనసులు ... 

ప్రశాంతంగా పలకరించుకుంటే
పాలపొంగులే పసిడినవ్వులే.. 
వడివడిగా మాట పెంచితే 
విడివడి తమాషా చూస్తుంది.. 

మహాసంగ్రామాలకు కూడా మూలమై
మహోత్పాతాలకు దారితీసి 
శ్మశాన వాటికలకు ద్వారాలు తెరిచి
శవాల లెక్కలు అప్పజెప్పుతుంది ... 

మాటకు మౌనం సమాధానమైతే 
సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ... 
మౌనం మన రాచ బాటయితే
మహాఋషుల బాటలు గోచరిస్తాయి… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment