జీవితం ఒక స్వప్నమైతే
తేది : 20-03-2024
శీర్షిక : అంతా శుభమే ...
సహస్రాధికం
సుందరం సుమధురం
రంగులమయం సప్తవర్ణం
రాచమందిరం రాజలాంచనం
అలంకారపూరితం రసరమ్యం …
ఆకలి దప్పుల ఊసులేదు
అలమటించి పని చేయాల్సిన
ఆలోచనల ఒత్తిడి లేదు ...
క్రమ శిక్షణల కవాతు లేదు ...
పాలకుల పరేశానుకు దూరం ...
గణాల గుణదోషపు లెక్కలు లేవు ..
లంచగొండ్ల బాధలు లేవు
అన్యాయాల గోల ఉండదు ....
మబ్బుల రథంపై తేలియాడుతూ
మంచు కొండలపై తచ్చాడుతూ
కొండల లోయల కొత్త చిత్రాలను
ఆవిష్కరించుకుని ఆనందాలు ఏరుకోము.
కంటకమెరుగని కలల లోగిలిలో
అన్నీ మంచి విషయములు
కలబోసుకుని ఆనందాల పంట
పండించుకుని కాలక్షేపము చేయమా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment