Sunday, July 14, 2024

సామాజిక సేవ తేది : 19-03-2024 శీర్షిక : మనసు పెడితే…

 సామాజిక సేవ 

తేది : 19-03-2024
శీర్షిక : మనసు పెడితే…

సమస్య లేని సంఘం లేదు 
సమస్యలన్నీ తీర్చలేకపోయినా 
వరసబెడితే ఒకటొకటి 
మనసుపెడితే ఎదో ఒకటి.... 

డబ్బుండటం .. లేకపోవడం కాదు 
మనసుంటే మార్గాలెన్నో ... 
నలుగురిని కూడగట్టే నేర్పు 
నలుగురితో అడుగులేసే ఓర్పు ... 

వెలకట్టలేని సేవలు వేలు లక్షలు 
బీదలకు చదువు చెప్పొచ్చు 
పేదలకు వైద్యం అందించొచ్చు 
ఆపన్నమై సలహాలు ఇవ్వొచ్చు ... 

ఈ మధ్య రాజకీయం కూడా 
సంఘసేవను భుజాన వేసుకుని 
రంగులు పూసుకుని పన్నులు 
ఎగ్గొట్టే మంత్రం జపిస్తున్నది ... 

ఏది ఏమైనా గమ్యం చేరితే 
గమ్మత్తు జరిగి ...మానవత 
మచ్చు తునకై ఆత్మీయతలు 
అలాయి బలాయి తీసుకుంటాయి ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment