Saturday, July 13, 2024

సప్త వర్ణ శోభితం తేది 19-12-23 శీర్షిక : వెన్నెలమయం.

 సప్త వర్ణ శోభితం 

తేది 19-12-23
శీర్షిక : వెన్నెలమయం. 

చింతలు లేని వింతేది 
చిక్కులు లేని జీవితమేది 
అంకితమై అడుగుడితే
సంచితమే కద సాయుజ్యం ... 

స్వార్ధపు సంకెళ్లను తెంచుకోగలిగి 
సమభావనలు నింపుకుని
సమదృష్టిని కేంద్రీకరిస్తూ 
సమతా మమతలు చాటగలిగితే ...
జీవితమే పండు వెన్నెలమయం
అడుగడుగున సప్తవర్ణ శోభితం… 

కొన్ని కొన్ని చోట్ల కొరతలే ఇంకా
చెరపకురా చెడెదవు అన్నా 
వినిపించుకోని వింత సంత 
పొరుగుక్షేమం పొందులాభం 
విన్నా పొదువుకోని మంచితనం ...

అనుభవాల తోటలో 
మల్లె పరిమళాలు ఘ్రానించాలి… 
కాటగలిసిన బాటసారి కాకుండా
కలికాలంలో కూడ మంచితనానికి
మారుపేరవ్వాలి…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment