Saturday, July 13, 2024

నిన్నే నమ్మి చేరితి తేది 13-12-23 శీర్షిక: ముక్తి మార్గము

 నిన్నే నమ్మి చేరితి

తేది 13-12-23
శీర్షిక: ముక్తి మార్గము 
సహస్రాధికం 

మంచి చెడులు ఎంచలేని
బాధ్యతెరుగని బాల్యమందు
ఆటపాటల కోయిలనయ్యి 
లీనమైతిని పూటకొక్క ఆటలోన… 

మంచి చెడులను ఎంచ నేర్చి 
సుద్దిబుద్దుల సరి జాడలలో 
బుద్ది జ్ఞాన సంపదలనార్జించగ
విద్యాకుసుమమైతిని విరబూయనెంచి…

బోగి కాలేక యోగి కారంటుంటే 
మోక్ష మార్గపు ముఖద్వారం 
గృహస్తాశ్రమము పుచ్చుకుని 
పిల్లాపాపల పితలాటకంలో మునిగిపోతిని ... 

శరణాగతియే సర్వోత్కృష్టమని 
అనుభవాల తోటలోన అడుగులేసిన 
బాటసారిగా నేర్చుకున్న ముక్తిమార్గపు 
బాటలను బద్దకింపక బుద్ధిపూర్వకమై
పాటింపనెంచి…నమ్మి చేరితి నీ చెంతన… 

చింతలన్ని బాపి నన్ను చేరదీయగ రావా
ఈశ్వరా…ప్రార్థిస్తూ వేచియుంటిని గవాక్షమ్మన… 
కరుణ చూపి కాపాడుమయ్యా గాంచి నన్ను
కామితార్థముల…. కల్పతరువుగా… దేవా… 

 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment