అక్షర బిందువులు
తేది 17-04-24
శీర్షిక : అమృత వర్షం
రుధిరం మరిగించి స్వేదం
పండించే
శ్రామిక జండాను నేనయితే..చల్లని
సమీరమును మోసుకొచ్చి
మెల్లగ మీటి
ఉపశమింపజేసే వీవనవు నీవవుతావు…
ఆరుగాలం అవని మాతను అక్కునచేర్చుకుని
బొక్కలన్ని పిండి
చేసుకునే కర్శకున్ని నేనయితే …
పెద్దమనసుతో సద్దిమూట లాంటి ఒక్క సుద్దుల
మాటతో ఓదార్చే పెద్దమనిషివి నీవవుతావు…
గాలి దుమారంలో గమ్యం తప్పి పోయి
తటపటాయించే గాలిపటం నేనయితే…
సంక్రాంతి నెలలో వీచే పిల్ల గాలివై
గమనం తెలిపే ఆశల చుక్కాని నీవౌతావు ...
ఛత్రము చేకొని నిండుగ వర్షమునకై
చేతులు జోడించిన కర్షక మునిలా
శ్వేతపత్రమును కలమును చేత బూని
స్తుతియింతును మనసారా వీణాపాణిని...
మెండైన భావములు విరాజిల్లే
నిండైన అక్షరముల జల్లులు
కురిపించగ తనువంతా మురిసిపోవాలని
మనసంతా గంతులేయీలని కోరుతూ…
అమ్మ క్రీగంట చూపులు ప్రసరించగనే
పాలధారలై పసికందు కడుపు నిండిన చందం..
అక్షర బిందువులతో అమృత వర్షము కురిపించి
కరువు దీరిన కర్షకుని మోమును చేస్తుంది…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment