జవాబుకై ప్రశ్నిస్తున్నా ...
తేది : 18-03-2024
శీర్షిక : అవును జవాబుకే ....
పెద్దరికాలకు సుద్దుల పరిమాళాలు
అద్దుకుని ... గొప్పల కోసం జవాబులు
ముందుగ చెప్పే గణాలు ..పగ్గాలందగానే
బూడిదలో పోసిన పన్నీరు చందమేల ?
పెద్దరికం కట్టబెడుదామనుకుంటే
మనుషులమేనన్న ఇంగితం మాయం...
తిరిగిచూసే లోపల నాలుక మడతేసి
తొండాటలు ఏల చెల్లుబాటు...?
బక్కోని మీద ఎక్కి తొక్కి నారదీసే
లెక్కలేనన్ని అధికార గణాల గుంపులు
తెగబలిసిన తిమింగలాలను
తగలేయవు ఎందుకనో ?
మరామరాల మర్మాలను దాచేస్తూ ...
ఇటు లోపల ... అటు బయట ....
అడుగేసే అధికార యంత్రాంగం ...
ఆమ్ ఆద్మీకి అర్థం కాదేలనో ?
అన్యాయం అనకొండలౌతుంటే
న్యాయం ధర్మం బక్కోడై చిక్కిపోతూ
పారదర్శకతల పసుపు కుంకుమలు
అనుకున్నంత సులువు కాదని రుజువులే... !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment