బాలల గేయాలు.
తేది. 16-09-23
శీర్షిక బొజ్జ గణపయ్య.
బాలలూ వినరండి
బొజ్జ గణపయ్య కథ కనరండి
అమ్మచేత నలుగుపిండి
ఆకారము దిద్దుకునే
ఆయువులు నింపుకుని
గణపతిగా అవతరించె ...
//బాలలు//
అమ్మమాట జవదాటక
కాపలాకు సిద్ధమాయె
వివరమేమి తెలియకనే
వింతగ పోరే నాన్నతో
బాలలూ వినరండి
బొజ్జ గణపయ్య కథ కనరండి
మురిపాల బాలుడైనా
ముక్కంటితో యుద్దమనెను
సిద్ధపడిన బాలుడిని
శిరచ్చేదం గావించెను ..
// బాలలు//
అసువులను వదలగనే
అమ్మశోకం మిన్నంటె!
అంతలోనే నిజము తెల్సి
ఆ గజాసురుని తలనతికించె...
బాలలూ వినరండి
బొజ్జ గణపయ్య కథ కనరండి
నాటినుండి నేటివరకు
గజవదనుగ ఖ్యాతిచెందె
బాలలకు నేస్తమై
పెద్దలకు దైవమాయె….
// బాలలు //
చదువులలో ప్రతిపనిలో
తొలిపూజల దైవంగా
విశ్వమంత ఏలికయ్యి
వినుతికెక్కి నిలిచాడు
బాలలూ వినరండి
బొజ్జ గణపయ్య కథ కనరండి
నగునూరి రాజన్న
No comments:
Post a Comment