పేరడి గేయం ...
తేది : 16-03.24.
మాతృక : దేవుడు చేసిన మనుషుల్లారా
( ప్రేమ ఆప్యాయతలు స్వగతం)
మనుషులు చేసిన యంత్రాల్లార్రా
యంత్రాలతో బ్రతికే మనుషుల్లారా
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
మనుషులు చేసిన
యంత్రాల్లార్రా
యంత్రాలతో బ్రతికే
మనుషుల్లారా
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
గోవిందా హరిగోవిందా..
గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా..
గోవింద గోవింద భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా..
గోవింద గోవింద భజగోవిందా
ఆ..ఆ..ఆ..ఆ.. ఓం..
చరణం ...
చక్రం పనిముట్లు ...
ఆ చక్రం పనిముట్లు ...
మా తొలి శత్రువు
మా తొలి శత్రువు ...
తొలి నుంచి
మా బద్ద శత్రువు
మా బద్ద శత్రువు
కోరిన కోరిక తీరుటకు ...
కోరక ఫలితం దొరుకుటకు
చక్రాన్ని సేవించాలి ....
పనిముట్లను ధ్యానించాలి ...
గాలి బుడగ జీవితం...
ఓటి కుండ సంపద
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
వినండి మానవ గోల ...
కనండి యంత్రపు లీల
మనుషులు చేసిన యంత్రాల్లార్రా
యంత్రాలతో బ్రతికే మనుషుల్లారా
పేదల నెత్తురు తాగిన రూపం
పెద్దల సంపద దాచిన పాపం
పేదల నెత్తురు తాగిన రూపం
పెద్దల సంపద దాచిన పాపం
పేదోళ్లను పీడించే శ్రమ ...
పెద్దోళ్ళను ఆడించే శ్రమ
పేదోళ్లను పీడించే శ్రమ ...
పెద్దోళ్ళను ఆడించే శ్రమ
పేద గొప్పలు జాన్ దేవ్
ఆ తేడాలిక్కడ లేనే లేవ్ ...
పేద గొప్పలు జానే దేవ్
ఆ తేడాలిక్కడ లేనే లేవ్ ...
వినండి ఆస్తుల గోల
కనండి మనుషుల లీల
వినండి ఆస్తుల గోల
కనండి మనుషుల లీల
హే యహా ...
గాలి బుడగ జీవితం
ఓటి కుండ సంపద
గాలి బుడగ జీవితం
ఓటి కుండ సంపద
నిన్న తిరిగి రాదు రాదు రాదు ...
నేడన్నది నిజం ..
నేడన్నది నిజం
రేపు మనది కాదు కాదు ..
నేడే సంతోషం నేడే సంతోషం
సంతోషం సంతోషం నేడే సంతోషం
ప్రేమే బ్రహ్మానందం ... అహా
ఆత్మీయతే పరమానందం ఒహో
ప్రేమే బ్రహ్మానందం ... అహా
ఆత్మీయతే పరమానందం ఒహో
ఆ ...ప్రేమే బ్రహ్మానందం ...
ఆత్మీయతే పరమానందం....
ఆనందం పరమానందం..
ఆనందం బ్రహ్మానందం ||4||
ఆనందం ఆనందం
ఆనందం ఆనందం
ఆనందం ఆనందం
వినండి కాసుల గోల ...
కనండి మనుషుల లీల ...
వినండి కాసుల గోల ...
కనండి మనుషుల లీల ...
మనుషులలో ప్రేమలు లేవు
జంతువులలో కక్షలు లేవు
మనుషులలో ప్రేమలు లేవు
జంతువులలో కక్షలు లేవు
విమానాలలో విహరిస్తుంటే
సముద్రాలనే దాటేస్తుంటే
విమానాలలో విహరిస్తుంటే
సముద్రాలనే దాటేస్తుంటే
దేహంలో ఎందుకు ఆత్మారామా
నిను విడుదల చేస్తాం లేవయ్యా
దేహంలో ఎందుకు ఆత్మారామా
నిను విడుదల చేస్తాం లేవయ్యా
రామయ్యా రామయ్యా
లేవయ్యా లేవయ్యా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment