అమ్మ ...బొట్టు పెట్టె...ఓ జ్ఞాపకం
తేది : 18-03-2023
శీర్షిక : తరగని ఆస్తి... ఆ మధుర జ్ఞాపకం
సంఖ్య : సహస్రాధికం
శ్రీమహాలక్ష్మి చిత్రమే...సింధూరం
దిద్దుకున్న అమ్మ ముఖం ...
అలసట జాడల ఆనవాళ్లు
ఆమడదూరాలలోనే ఆగిపోయేవి.
బుద్ధినేర్చినంక గాని సుద్ధులై
బోధపడలేదు.... అసలు రహస్యం ....
అమ్మమ్మ చేతులమీదుగా
అందుకున్న ఆ చెక్కపెట్టె మహత్యం ....
ప్రతిరోజు పదిలంగా పట్టుకుని
పదినిమిషాలు అలంకరించుకుంటూ
అపురూపంగా చూసుకుంటూ
ఆసాంతం స్పృశిస్తూ మురిసిపోయేది .....
చెక్కపెట్టె మాత్రమే కాదది ....
అమ్మమ్మ ఒడిలో ఆనందించిన
క్షణాలను అమ్మ మననంతో
నెమరేసుకునేది ఆ నిమిషం .....
అరడజను మందికి అలవోకగా పంచడానికి
సరిపోయేంత ప్రేమ నింపుకునేది ....
ఎందుకంటే తానిప్పుడు అమ్మ
తరగని ఆస్తిని తరాలకివ్వాలిగా .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment