చిత్ర కవిత
తేది : 03-04-2023
శీర్షిక : తొలివలపుల భావ తరంగాలు ...
సంఖ్య : సహస్రాధికం
ఆలోచనలల్లుకుని
కులుకు పలకరిస్తోంది ....
అవనిపైన నిలువలేక
ఆకాశంలో విహంగమైంది ....
హృదిగదిలో కితకితలు
మనసంతా నిండిపోయే...
మమతల తీగలల్లుకుని
మారాములు చేయుచుండె ....
యవ్వనాల పులకింతలకు
జవ్వనాల మెరుపుతీగలే...
నయనమనోహరములే
నగారా మోగించుచుండగా ....
ఊహలన్నింటిని మోసుకుని
ఊసులెన్ని మూటకట్టుకొచ్చిందో ..
ఉడికిస్తున్నది నా మనసును
ఉత్తరమై పుణ్యం చేసుకుని ....
మత్తులన్నీ ఆవరించి
మధురిమలను పంచుతుంటే ....
పరధ్యానం ఆవరించి
పెన్నిధిలా పెనవేసుకునే .....
గుండె అంతా బరువెక్కి
గువ్వలా ఒదిగిపోతుంటే ...
లోలోపల కోయిలలు
రాగాలను మీటుచుండె ....
ప్రియా .... ఓ నా ప్రియా
ఎన్నాళ్లీ ఎదురుచూపులు
ఓపలేను ఈ మధురభావనలు
తొలివలపుల భావ తరంగాలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment