లలిత గీతాలు
తేది : 16-07-2022
శీర్షిక : ఏడుకొండల వెంకన్న
కవిత సంఖ్య :
ఏడుకొండల వెంకన్నా
వేగమేరారా దరిచేర్చా...
దర్శన భాగ్యపు అర్చనలే
దండిగ భక్తుల బ్రోచుటకై
విష్ణురూపమే వెంకటేశుగా
విశ్వరక్షణకు ఏతెంచితివా ...
అలిగినదేవిని అనునయించ
ధ్యానచింతన చేయుచుండగ
వల్మీకములో శయనించి
వరశివ బ్రహ్మల గోక్షీరం గ్రోళ
ఏడుకొండల వెంకన్నా
వేగమేరారా దరిచేర్చా...
వకుళమాతకు వరపుత్రుడవై
వసుధలోన వెలిసితివా ....
గోవిందరాజు సోదరుడా
గోపాలకృష్ణ అంశజుడా…..
ఆకాశ రాజు అల్లునిగా ...
ఆదిలక్ష్మికి పతిగా నిలిచి ....
గోదాదేవిని కరుణించ
రంగనాథుడుగ వెలసితివా ...
ఏడుకొండల వెంకన్నా
వేగమేరారా దరిచేర్చా...
ఇద్దరు భామల ముద్దుల మూర్తిగ
కొండల పైన వెలిసితివా ....
అన్నమయ్యచే కీర్తనలంది
అలవైకుంఠముగ అలరారుచుంటివా...
కాచి మమ్ము రక్షించుమయ్యా
కలియుగ దైవం నీవెకద
గోవిందా హరి గోవిందా
గోకుల రమణా గోవిందా….. .//ఏడు//
ఏడుకొండల వెంకన్నా
వేగమేరారా దరిచేర్చా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment