కళ్యాణం చూతము రారండి
తేది : 17-04-2024
శీర్షిక : కమనీయం కళ్యాణం ...
కదలిరండి పురజనులారా
కలియుగాన పుణ్యదినము
కాంచడమే కళ్యాణము
కమనీయం మనోహరం...
కళ్యాణ రాముడిని
కరుణామృత సోముడిని
కనులారా గాంచుటకు
కనికరించే నేటి దినం ...
గురువాజ్ఞల గురుతరముగ
శివధనస్సు విరచినంతనే ...
వైదేహి మాత వరమాలను
వరించిన పురుషోత్తముడి
కళ్యాణానికి ....
ఊరువాడ కదలినాది
దారులన్నీ గుడులవైపే
మండుటెండలు లెక్కజేయక
ముక్తి కోరిరి పెళ్లి చూసి ....
తరాలు మారినా తండ్లాటాలే
యుగాలు గడిచినా నామ జపమే ...
డాంబికాలకు మాట మార్చినా
అంతరంగములో ఆ నామమే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment