Thursday, July 25, 2024

కవన రవళి నానీలు 10-01-24

 కవన రవళి 

 నానీలు 
 10-01-24

 1.ఆయనం మార్పుకు 
అంకురం… 
పుణ్యకాలాలకు 
ఇదే ముహూర్తం…

 2.ఆనంద భోగాల 
ఆదిపర్వం… 
సూర్యమానంలో
 నిల్చిన సుందరం…
 
 3.పాత అహాలను 
అంటిస్తే… 
అదేకద నిజమైన
 భోగి పండుగ…

 4.పాతరోతల 
తలంటు స్నానాలు… 
మార్పుకు 
నూతన వస్త్రధారణలు…

 5.భోగిపండ్ల 
ఆశీర్వచనాలు… 
 పిల్లలకవే 
శ్రీరామరక్షలు…  

నగునూరి రాజన్న. కరినగరము.

No comments:

Post a Comment