భక్తి గేయాలు
తేది : 17-02-2024
శీర్షిక : మార్కండేయుడు ...
మృకండు తనయుడా
మురిపాల బాలుడా ....
అలవోకగ నీ కథను
ఆలపించి ప్రస్తుతించ...
కరుణించి నోటివెంట
గానమై అనుమంతించు ....
మాహాసాధ్వి మరుద్వతిని
మాతగా పొందితివి ...
మృకండుడే కోరుకుని
మురిపంగా జనకుడాయె ....
మృకండు తనయుడా
మురిపాల బాలుడా ....
ఘోరమైన తపముతో
భారమును దించగోరే
వారణాశి చేరుకొని
మహాదేవుని ప్రతిష్టించే ....
తపస్సుకు మెచ్చుకున్నా
తప్పలేదు పరీక్షలపుడు ...
ప్రశ్నించెను మహాదేవుడు
కోరికేదో తెలుపమంటూ ...
మృకండు తనయుడా
మురిపాల బాలుడా ....
పదారేండ్ల సద్గుణుడా ?
పాపాల చిరంజీవుడా ? యని
అనినంతనే కోరుకునే
సద్గుణాల బాలుడని ....
ఉపనయనం తదుపరి
సప్తఋషులు దీవించగ ...
చిరంజీవి యంటూనే
చతుర్ముఖుడు దీవించే ....
మృకండు తనయుడా
మురిపాల బాలుడా ....
శివభక్తి శక్తిగామారి
కింకరులను తరమంగా
పాశమును సంధించే
పక్షపాతమెరుగని సమవర్తి ...
నిరంతర శివధ్యానంతో
నీరుగారే మృత్యునీడ ....
విశ్వములో నీ గాథ
నిజభక్తికి నిదర్శనం ....
మృకండు తనయుడా
మురిపాల బాలుడా ....
No comments:
Post a Comment