Saturday, July 13, 2024

ఊరించే ఊసులు .. తేది :17-01-2024 శీర్షిక : మంచి చెడుల సంగమం ...

 ఊరించే ఊసులు .. 

తేది :17-01-2024
శీర్షిక : మంచి చెడుల సంగమం ... 

ప్రేమ లోక సామాన్యమైనా  
ఫ్రేము కట్టే విధానం విభిన్నం ... 
మాట అతి సాధారణమైనా 
మన్నికై మనసున నిలుపగలగడం .... 

ఒక్క ఐడియా జీవితాన్ని 
మార్చుతుందంటే....నిజమేనని 
నమ్మిన జనమంతా కలగలిసి 
నిటారుగా నిలబెట్టిన వైనం ...  

డబ్బులు ఊరికే రావంటూ 
టముకేసుకుని వార్తల్లో నిలబడితే .... 
ఎప్పుడెప్పుడా అని అతివలంతా 
ఎదురుచూస్తూ గడపడం .... 

పని ఒత్తిడిలో పడిపోయిన వారికి 
పలకరించి అప్పులిస్తామనో 
పదం కలిపి రహస్యాలు రాబట్టాలనో 
ప్రతినిత్యం వింటున్న వార్తలు .... 

సాంకేతికతల కనుసన్నల్లో 
సాధారణ వినియోగదారులకు 
సమస్యల విష వలయాల వలను విసిరి 
సంతుల జీవనాలను సట్టుబండలు చేయడం .... 

స్వార్థ రాజకీయ సరంగులంతా 
పొరుగుల సమాచారం పొల్లు పోకుండా 
వల్లె వేయించుకోడానికి వాడుకునే 
వంచన విధానం... అందమైన అతివ.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment