కూడ గట్టిన నడక
తేది : 30-01-2024
శీర్షిక : అనుభవాల తోట...
ధైర్యం కూడగట్టిన నడకలే
ధీటుగా చీకట్లను చీల్చుకుని
కౄర జంతువులను దాటుకుని
వెలుగుల లోకానికి పరిచయించింది ....
ప్రగతి పథానికి పదములు
కదలాలంటే... అనుభవాల
తోటలో నడిచిన అచ్చులు
జాగ్రత్తగా వెదకాల్సిందే....
పంచతంత్రములో మూడు
చేపల కథలో ...మొదటి
చేపయితే సౌకర్యం ...కనీసం
రెండవ చేపన్నా అయిపోతే
అవాంతరాలు అధిగమించవచ్చు....
సత్సంకల్పానికి ఎప్పుడైనా
శ్రద్ధ విశ్వాసం వెంటబెట్టుకుని
కదిలితే ...స్థితులకు పరిస్థితులు
తోబుట్టువులైతే...అంతా విజయమే.
తిరిగి చూసేలోపు మాయం
చేసే ప్రపంచంలో పయనమంటే
అడుగడునా ఏమార్చలేని సునిశితం
అలుపెరుగని పోరాట పటిమలే
ఆధారభూతం.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment