ఆ నింగి నుండి ఈ నేలదాకా
తేది 10-01-24
శీర్షిక : విజ్ఞాన వీచిక …
అందమైన స్వాతి ముత్యంలా…ఆల్చిప్పలో
అమురుకున్న సప్తవర్ణ శోభితం…ఈ భూమండలం
అనితరమైన సుందర మనోహర దృశ్యం…
అనంతమైన ఈ అపురూప విశ్వ భంఢాగారం.....
మంటికీ మింటికీ మధ్యన నిలిచిన
శూన్యముతోబాటు బహు సుందరమూ ...
కంటి చూపులకు కలిసిపోతున్నట్టు భ్రమింపజేసినా
కలవని స్వీయ నియంత్రణల చిత్రమై
కలిసి బ్రతుకుతున్న గ్రహ కుటుంబమే ....
తరంగాల దైర్ఘ్యములతో
తనువంతా పులకరింపజేసుకుంటూ…
జీవరాశికి జవజీవాలను ఇస్తూ
సాంకేతికత సౌరభాలను సైతం
గుభాళింపజేస్తున్నది ...
ముద్దబంతుల్లాంటి పాలపుంతలతో
మురిపమైన గ్రహ హారములుగా విలసిల్లి
ముచ్చటగొలుపుతున్నది శూన్యమంతా…
సూర్య చంద్ర నక్షత్ర మండలాలతో….
ఒక్కొక్క పాలపుంత
ఒక్కొక్క విజ్ఞాన భాండాగారం ...
కల్పవృక్షంలా ఒడువని వింత ముచ్చటే ......
తరాలకైనా తరగని విజ్ఞాన వీచికలే ....
ఒక వింత విసిరిందంటే మనిషి
జీవితకాలమంతా వీడని చిక్కుముడే....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment