Saturday, July 13, 2024

వేములవాడ జాతర పాట 2022

 వేములవాడ జాతర పాట 


ఎములాడ దేవుడట 
రాజేషుని మహిమలట 

గణపతికి మొక్కి మనం 
గంటకొట్టి అడుగుదాం 
అడుగడుగున మనల్ని 
ఆపదల్ల ఆదుకొమ్మని  //ఎము//

పార్వతమ్మ ఒడిలోన 
పారాడిన బతుకులు 
పానాలకు  హాయిగా 
అమ్మ కడుపు సళ్ళన  //ఎము//

రాజేసుని నీడలోన 
రందిలేని బతుకులు
రారాజుగ బతుకుదం 
పిల్లా జెల్ల సల్లగుండ… //ఎము//

గండదీపమెలిగించి 
గండాలను బాపుమని  
పూజలాన్ని చేసి మనం 
కోడె కట్టి మొక్కుదాం .... //ఎము//

భీమేశ్వర  గుడికెళ్ళి 
అభిషేకం చేయిద్దాం .... 
అంజన్నను దర్శించి 
ఆదుకొమ్మని అడుగుదాం ... //ఎము//

పోచమ్మకు శాఖవోసి 
మనసారా మొక్కుదాం 
పిల్లా పాప సల్లగుండె 
ఆనతిమ్మని అడుగుదాం ...//ఎము// 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment