చిత్ర కవిత
తేది : 14-08-2023
శీర్షిక : అలిగిన చెలి
సహస్రాధికం
చిత్రం విచిత్రం… అలిగిన చెలి
కోరికనో ఏమో
ఆ నింగిన వంగిన
చంద్రవంకను ముక్కున కరిచి
అలకతీర్చే అపర భగీరథ ప్రయత్నం ...
అపూర్వమైన కానుకతో
అలకలు తీర్చుదామని
తంటాలు పడి తెచ్చానోయి
వెంటనే నను గుర్తిస్తావని ...
ఇకనైనా బుంగమూతి పెట్టే
అలక మానవే... నా చిలకల
కొలికి ... కడుపు మాడ్చక
కదలవే కలిసి చేపల వేటకు ....
ఒక్కపూట పలకక పోతేనే
ఓటికుండ చిల్లు పడ్డట్టుంది ....
ఓర్చలేను ప్రియసఖీ
ఇక ఏమాత్రం ఈ దూరం ....
కనికరించి కరుణించుమా
తొలకరి పలకరించినప్పటి
అవని మాత ఆనందంలా ....
ఆణిముత్యాలను మూటకడుతూ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment