Thursday, July 25, 2024

నానీలు 16-04-24

 కవన రవళి.  

నానీలు 

 16-04-24

త్యాగమంటే
తరువే చిరునామా.. 
తల్లీ పిల్లల 
ఆత్మీయతలా… 

 2.  రైతు త్యాగానికి
రాళ్ళు కరిగినా… 
రాతి గుండెల
దళారి కరగడు…

త్యాగం రైతుది
మిలమిల
 మెరుపులు కళ్ళల్లో 
 రొక్కంతో దళారికి… 

 3 ఎండా వానల
 సైనికుడి ప్రాణం
 పండగలా 
 ప్రజా జీవితం… 

 4. రైతు రుధిరం
 స్వేదమై కురిస్తేనే
 అంకురాలు 
 నూర్పిల్లకొస్తాయి… 

 5.శ్రమ సౌందర్యం
 శోభిస్తేనే… 
 పెట్టుబడిదారు 
 పెట్టె మెరుపులు… 

 రాజన్న నగునూరి

No comments:

Post a Comment