Thursday, July 25, 2024

మట్టి సరిగమలు . తేది:15-04-24 శీర్షిక: బిన్నత్వంతో ఏకత్వం

 మట్టి సరిగమలు .

తేది:15-04-24 
శీర్షిక: బిన్నత్వంతో ఏకత్వం 

ముట్టి చూడు మట్టి విలువ 
ఆణువణువూ ఆరాటమే 
జీవరాశి వృద్ధిలో బావుటా 
ఎగరేయాలని పోరాటమే ..

పట్టిందల్లా బంగారం చేసే 
పరమాత్మ స్వరూపంతో .... 
మట్టిలో మానెడు పోస్తే 
ఇంటిలో పుట్టెడు నింపుతూ ... 
 
అమ్మలా అక్కున చేర్చుకుని 
కోట్ల జనాభాకు నోట్లోకి 
నాలుగు మెతుకులై ... 
పుట్ల పంటలతో మానవాళిని 
అక్కున చేర్చుకుని దీవిస్తుంది…. 

భిన్నత్వంలో ఏకత్వంలా ... 
మట్టిలో మర్మమైన భిన్న రుచుల 
ఫలాలతో .. భిన్న వర్ణాల 
పుష్పజాతులతో పుష్కలమే ... 

బహుదూరపు బాటసారిలా 
మంచి చెడులు మూటకట్టుకుని 
మహిమాన్వితమై... తరాల 
తరబడి సాగిపోయే సహనశీలి ... 

అనుక్షణం గమనిస్తూ పెరిగినా 
మహిమాన్వితమైన మట్టిని 
అవపోశన పట్టలేక... మనిషి 
అశక్తుడుగానే మిగిలిపోయాడు ...  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment