నడిచే నక్షత్రాలు
తేది : 16-04-24.
శీర్షిక : పున్నమి చంద్రులు.
సహస్రాధికం
అమ్మచేత గోరుముద్దలకు
అద్దమైన చంద్రుడు ఆ నక్షత్ర
మండలం అజరామరామైన
ఓ నవ్వుల అందాల భరిణె ...
అనువుకాని చోట అధికులము
అనరాదంటూ నిశి చీకటిలో మాత్రమే
నిక్కచ్చిగ నిలిచి ఆకాశంలో నిగారించే
మిలమిలలు…నింగిపైన పరుచుకున్న
నిఖార్సైన తళుకుల బెలుకులు…
నిశ్చలతలతో నిశిలో మాత్రమే
కానవస్తే లాభం లేదనుకున్నాయో
ఏమో.. నడిచే నక్షత్రాలను తమ
ప్రతినిధులను చేసి పంపించాయి ...
వెండి తెరల జాడలలో దండి పేరు
ప్రతిష్టలతో నిండు పున్నమి చంద్రులై
వెండి వెలుగులు వెదజల్లుతూ…
చిన్నా పెద్దల మనోల్లాసాలకు మంత్రమైనారు…
చీకటి వెలుగులతో లెక్కలు లేక
చిరంతనం కనులముందే కదలాడుతూ
కమనీయ మనోహరాల సృష్టిని
దర్శనీయము గావిస్తూ తరిస్తారు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment