Thursday, July 25, 2024

మట్టి నా ఆనవాళ్లు తేది 04-01-2024 శీర్షిక : మూలధాతువు

 మట్టి నా ఆనవాళ్లు

తేది 04-01-2024
శీర్షిక : మూలధాతువు 

జన్మమే మర్మం మానవాళికి … 
అర్థం కాకుంటే వ్యర్థమే ఈ జీవితం… 
అయినా నటనలే అసలేమి తెలియని 
అమాయకత్వాల తోటలో తచ్చాడుతున్నట్టు… 

రూపం చూసుకున్న మురిపం.. 
రంగు చూసుకున్న పొంగు… 
అందమైన కుందనమని ఆరాటం… 
మూలమెరుగని మూర్ఖత్వం … 

అయినా కొందరిలో ఇంకా ఆ స్వార్థం.. 
చొక్కాలు మార్చుకుని నిజానికి దూరంగా
ఎల్లకాలం బతుకుతామని ఆశలతో 
పిల్లి పాలు తాగుతున్న చందంగా 
ప్రజా ఆస్తులను పట్టం కట్టుకుని 
స్వీయ ఆస్తులుగా చలామణి చేసుకుంటున్న 
కోకొల్లల సాక్ష్యాలు… 

అవనిని అంటిపెట్టుకున్న ఆనవాళ్ళే..
రంగులెన్నో ఒలకబోసే కుసుమాలైనా… 
రుచుల్లెన్నో చూపించే ఫలములైనా.. 
మూలమంతా మట్టి పరిమళాలని మరవొద్దు… 

అసలైన మట్టి వారసుడు రైతన్న మాత్రం 
కష్టాలకు వారసత్వం పుచ్చుకున్నట్టుగా 
అడుగడుగున కష్టాలను ఆసరా చేసుకుని
అడుగులేస్తున్నాడు… అప్పుడప్పడు 
ఓర్చుకోలేక వివిధ కారణాల నేలకొరుగుతున్నాడు… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment