Sunday, July 14, 2024

స్వీయ దర్శనం తేది : 15-03-2024 శీర్షిక : సత్తెకాలపు సత్తయ్యను

 స్వీయ దర్శనం

తేది : 15-03-2024
శీర్షిక : సత్తెకాలపు సత్తయ్యను 
సహస్రాధికం ... 

పాము కుడితే పరేశానంటే 
కరిపించుకుని  ఫలితం 
చూడాలనుకునే రోజులివి ... 
మరి నేనెందుకు ఇలా ముందు 
జాగర్త ... ? 

నెయ్యి ఎల్లబెట్టి .. ఇంకేదో 
వెళ్ళ దీయడమంటే మక్కువే 
చాలా మందికి ... మరి నేనెందుకు 
అతి లేదు... తక్కువ లేదు ... 
మోతాదులో భారం మోసుకుని 
బాధ్యతతో నడుచుకుంటా ?. 

కొందరు ... ఎదురుగ పొగుడుతూ . 
గడ్డిపరక చాటయిందంటేనా ... 
చాట తిరగేసి మోత మోగించడమే ... 
మరి నేనెందుకిలా ... ఒకేలా ?. 

అడుగడుగున ప్రశ్నించుకుంటే 
అవగతమైనదేమంటే ... అమ్మ 
పెంపకమో  ... నా అతి జాగ్రత్తనో ... 
తామరాకుపై నీటి బొట్టులా ... 

ఇంకా లోలోతుగా మేధో మదనమై 
స్వీయ దర్శనం చేసుకుంటే ... 
తేలిందేమంటే ... కలికాలానికి 
తగని వాన్ని ... సత్తెకాలపు సత్తయ్యను ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment