జనన మరణాలకు ఆవలి వైపు
తేది : 15-05-2024
శీర్షిక: .. పదికాలాలు నిలవడం
అందరిది సాధారణం అయినా
కొందరిది మాత్రం ప్రత్యేకమే ...
కన్ను తెరిచి మూసిన మధ్యన
జరిగే తతంగమే జీవన విధానం ....
నాటిన చల్లని చెట్లవలనో .. కట్టిన
గొప్ప కట్టడాల వల్లనో ... ప్రజారంజకమై
పాలించిన విధానాల వల్లనో....
అజరామరమై వెలుగుతాయి ....
ఎలా ఉండకూడదో రుజువులు కొన్ని
ఎలా ఉండాలో ఉదాహరణలు కొన్ని
విగ్రహాలై నిత్యం పులకరింపజేసేవో...
భవితకు పాఠాలై పలకరించేవో ....
వందలేండ్లు వంత పాడుతున్నామన్నా
యుగాలైనా మరిచిపోలేనివైనా ...
వ్యక్తిత్వ వికాసానికెంత దోహదమో
చెప్పకనే చెప్పే పరోక్ష పాఠాలు ....
తిన్నావా బసవన్న అంటే ....
ఊ కాకుండా ... పదుగురి మనసు
దోచే కార్యక్రమం ఏదైనా పసందే ...
పదికాలాలు నిలిచే పవిత్రం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment